ePaper
More
    Homeక్రీడలుBCCI | దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదు: బీసీసీఐ

    BCCI | దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదు: బీసీసీఐ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: BCCI | ఐపీఎల్ 2025 వాయిదాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. భారత్‌-పాక్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా (india-pakistan tension ipl matches one week postponed) వేస్తున్నట్లు ప్రకటించింది. ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు, స్పాన్సర్‌లు, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వారం రోజుల తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను (next schedule and match details) వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా (BCCI Secretary Devajit Saikia) శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని ఈ ప్రకటనలో బీసీసీఐ స్పష్టం చేసింది.

    ‘ఐపీఎల్ 2025 సీజన్‌లో (ipl 2025 season) జరగాల్సిన తదుపరి మ్యాచ్‌లను తక్షణమే వారం రోజుల పాటు వాయిదా (remaining matches will continue after one week) వేస్తున్నాం. ఆ తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి సంబంధిత అధికారులతో చర్చించి తదుపరి షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను (next schedule and match details) వెల్లడిస్తాం.

    ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు (broadcasters), స్పాన్సర్స్ (sponsers), అభిమానుల (fans) అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఐపీఎల్ వాటాదారులతో (IPL stakeholders) చర్చించిన తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ (BBCI) మన సాయుధ దళాల బలంపై పూర్తి విశ్వాసం ఉంచినప్పటికీ, ఐపీఎల్ వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడం వివేకమని భావించింది. ఈ కఠిన సమయంలో దేశానికి బీసీసీఐ అండగా నిలుస్తోంది. భారత ప్రభుత్వం (government of india), సాయుధ దళాలతో (armed forces) పాటు ప్రజలకు సంఘీభావం తెలుపుంది. భారత త్రివిధ దళాల ధైర్య సాహాసాలను, నిస్వార్థ సేవను బోర్డు కొనియాడుతోంది.

    క్రికెట్ జాతీయ అభిరుచిగా (cricket is national passion) ఉన్నప్పటికీ.. దేశ సార్వభౌమాధికారం కంటే ఎక్కువ కాదని బీసీసీఐ భావిస్తోంది. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తమకు అండగా నిలిచిన ఐపీఎల్ వాటాదారులందరికీ (IPL stakeholders) కృతజ్ఞతలు’ అని బీసీసీఐ తమ ప్రకటనలో (statement) పేర్కొంది.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this