అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cricket in the Olympics | 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో Olympics క్రికెట్ రంగప్రవేశం చేయనుంది. 2028 లాస్‌ఏంజిల్స్ విశ్వక్రీడల్లో ఈ క్రీడ పునరాగమనం చేస్తోంది.
టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాలలో ఆరేసి జట్లు బరిలో దిగనున్నాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశించనుందనే వార్తతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ముఖ్యంగా భారత్–పాకిస్థాన్ పోరు జరుగుతుందా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ రెండు జట్లు లాస్‌ఏంజిల్స్ మైదానంలో పరస్పరం తలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
Cricket in the Olympics | ఏం జరుగుతుందో..
దీనికి కారణం ఐసీసీ ICC రూపొందించిన కొత్త అర్హతా ప్రమాణాలే. ప్రతి ఖండం నుంచి ఒక్కో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలని, ఆరో జట్టును గ్లోబల్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా నిర్ణయించాలని ఐసీసీ నిర్ణయించింది.
ర్యాంకుల ప్రకారం ఆసియా Asia నుంచి భారత్, ఒషియానా Oceania నుంచి ఆస్ట్రేలియా Australia, యూరప్ Europe నుంచి ఇంగ్లండ్ England, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా South Africa జట్లు ఎంపిక కాబోతున్నాయి.
ఆతిథ్య హక్కుల వల్ల అమెరికా America స్వయంగా టోర్నీకి అర్హత పొందుతుంది. దీంతో మిగిలిన ఒక్క స్థానం కోసం గ్లోబల్ క్వాలిఫయర్స్ జరగనుంది.
ఈ టోర్నీలో పాకిస్థాన్ సహా అనేక జట్లు బరిలో దిగనున్నాయి. అయితే ఇక్కడ గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నందున పాక్ జట్టు ఒలింపిక్స్‌లో అడుగుపెట్టడం సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
128 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ చారిత్రాత్మక క్రీడా సంబరాల్లో టీమిండియా India పాల్గొనడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కానీ పాకిస్థాన్ జట్టు మాత్రం లాస్‌ఏంజిల్స్ ప్రవేశం సాధిస్తుందా లేదా అనేది రాబోయే క్వాలిఫయింగ్ రౌండ్‌పై ఆధారపడి ఉంది.
భారత్-పాక్ హైఓల్టేజ్‌మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మాములు టోర్నీలలోనే ఈ రెండు జట్లు తలపడితే మ్యాచ్ రంజుగా ఉంటుంది. అలాంటిది ఒలంపిక్స్‌లో అంటే ఆ జోష్ పీక్స్‌లో ఉంటుంది. కానీ కొత్త రూల్స్ వలన అది జరిగేలా కనిపించడం లేదు.
