Homeక్రీడలుAustralia Cricket Board | రోహిత్‌- విరాట్ కోహ్లీ కోసం ఆస్ట్రేలియా అదిరిపోయే ప్లాన్.. మెచ్చుకుంటున్న...

Australia Cricket Board | రోహిత్‌- విరాట్ కోహ్లీ కోసం ఆస్ట్రేలియా అదిరిపోయే ప్లాన్.. మెచ్చుకుంటున్న రోకో ఫ్యాన్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Australia Cricket Board | ఆధునిక క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు టీమిండియా బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.

టీ20, వన్డే, టెస్ట్ అనే తేడాల్లేకుండా బరిలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురిపించడమే ధ్యేయంగా ఆడుతూ అనేక రికార్డులు కూడా సాధించారు. కొన్నాళ్లుగా టీ20, వ‌న్డే, టెస్ట్ మ్యాచ్‌ల‌లో స‌త్తా చాటిన ఈ ఇద్ద‌రు పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత టీ20లకు గుడ్‌బై చెప్పారు. ఇక ఇటీవలే టెస్టులకూ రిటైర్‌మెంట్ ప్రకటించారు ఈ ద్వ‌యం. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని వెల్లడించారు. దీంతో అభిమానులు తెగ బాధపడుతున్నారు. కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవడం ఏంటని ఫీల్ అవుతున్నారు. సత్కరించే అవకాశం కూడా ఇవ్వరా అని వాపోతున్నారు.

Australia Cricket Board | గొప్ప విష‌యం..

ఈ తరుణంలో రోహిత్-కోహ్లీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా Cricket Australia చేస్తున్న పని తెలిసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. బీసీసీఐ కూడా ఇప్పటివరకు ఈ స్టార్ బ్యాటర్స్ వీడ్కోలు గురించి ఆలోచించలేదు. అలాంటిది క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు వీళ్లు చేసిన సేవను గుర్తుంచుకుని గ్రేట్ సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది. రోహిత్ -విరాట్ కోహ్లీ ఇప్ప‌ట్లో గ్రౌండ్‌లో క‌నిపించే ఛాన్స్ లేదు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌(ODI series)లో మళ్లీ కనిపించనున్నారు. అక్టోబర్‌లో మళ్లీ ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనున్నారు.

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఇద్దరు లెజెండ్స్‌కి అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీసే చివరి టూర్ అవ్వనుంది. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా రోహిత్, కోహ్లిల Virat Kohli కోసం ఇప్పటి నుంచే వీడ్కోలు వేడుకల కోసం ప్లానింగ్ మొదలుపెట్టింది. భారత క్రికెట్‌కు సుదీర్ఘకాలం సేవలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు తమ కెరీర్ చివరి దశలో ఉన్నారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు వన్డే ప్రపంచ కప్ 2027 వరకు ఆడాలని కోరుకుంటున్నారు. ఇద్దరూ తదుపరి ప్రపంచ కప్‌ను గెలిచి అంతర్జాతీయ క్రికెట్‌(International cricket)కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ పర్యటనను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు సిరీస్‌గా సిద్ధం చేస్తోంది. ఆటగాళ్లుగా ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు ఇది చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనిని చాలా ప్రత్యేకంగా చేయాలనుకుంటోంది . ప్రత్యర్థి ఆటగాళ్లయినా గేమ్‌కు వాళ్లు అందించిన సేవలకు గుర్తుగా ఇలా ప్లాన్ చేయ‌డం గ్రేట్ అంటున్నారు.