ePaper
More
    HomeజాతీయంCredit Cards | క్రెడిట్​ కార్డు బిల్లు కట్టమంటే.. కుక్కతో కరిపించాడు

    Credit Cards | క్రెడిట్​ కార్డు బిల్లు కట్టమంటే.. కుక్కతో కరిపించాడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Credit Cards | ప్రస్తుతం క్రెడిట్​ కార్డులు వినియోగించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆయా బ్యాంకులు విరివిగా క్రెడిట్​ కార్డులు(Credit Cards) ఇస్తున్నాయి. దీంతో చాలా మంది కార్డులను తీసుకుంటున్నారు. అనంతరం ఆయా కార్డులను వినియోగించిన పలువురు సకాలంలో బిల్లులు చెల్లిండచం లేదు. దీంతో బ్యాంకులు రికవరీ ఏజెంట్లను(Recovery agents) కస్టమర్ల ఇంటికి పంపుతున్నాయి. తాజాగా ఇలాగే క్రెడిట్​ కార్డు బిల్లు కట్టమని వెళ్లిన ఓ రికవరి ఏజెంట్​పై కస్టమర్​ కుక్కను వదిలాడు.

    Credit Cards | రూ.రెండు లక్షల అప్పు

    హైదరాబాద్​లోని మధురానగర్​ పోలీస్ స్టేషన్​(Madhuranagar Police Station) పరిధిలోని జవహర్ నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.రెండు లక్షలు వినియోగించాడు. అయితే ఆ మొత్తం బిల్లు చెల్లించడం లేదు. దీంతో రికవరీ ఏజెంట్​ సత్యనారాయణ బిల్లు కట్టమని నందివర్ధన్​ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏజెంట్​పై ఆయన కుక్కను వదిలాడు. అది మీద పడి కరవడంతో సత్యనారాయణకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

    Credit Cards | స్థాయికి మించి..

    క్రెడిట్​ కార్డుల పుణ్యమా అని చాలా మంది స్థాయికి మించి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అవసరం లేని, అత్యవసరం కాని వస్తువులను సైతం క్రెడిట్​ కార్డులతో కొంటున్నారు. ఈఎంఐ ఆప్షన్(EMI option)​ ఉండటంతో క్రెడిట్​ కార్డులను విపరీతంగా వినియోగిస్తున్నారు. అయితే స్థాయికి మించి కార్డులు వాడుతున్న కొందరు బిల్లులు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో బిల్లు కట్టకపోవడంతో ఫైన్లు పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.


    అయితే బ్యాంకులు(Banks) క్రెడిట్​ కార్డుల బిల్లుల వసూల్​కు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఫోన్లు చేసి అడగటంతో పాటు రికవరీ ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే బిల్లుల కోసం ఇంటికి వెళ్లిన రికవరీ ఎజెంట్లు కొందరు కస్టమర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పలువురు కస్టమర్లు సైతం ఏజెంట్లతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా కుక్క(Dog)తో ఏజెంట్​ను కరిపించాడు.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...