అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thalaivar 173 | తమిళ సినీ పరిశ్రమ (Tamil Film Industry)లో మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న 173వ సినిమాకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించనుండగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి (Director Shibi Chakravarthy) దర్శకత్వం వహించనున్నాడు.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై“ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో ఉంటారు” అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌ను యాడ్ చేయడం విశేషం. ఈ ట్యాగ్‌లైన్ రజనీకాంత్ (Rajinikanth) ఇమేజ్‌కు పర్ఫెక్ట్గా సెట్ అవ్వడంతో, పోస్టర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్, సినీ అభిమానులు భారీగా షేర్ చేస్తూ హుషారు వ్యక్తం చేస్తున్నారు.
Thalaivar 173 | క్రేజీ కాంబోలో..
ఈ సినిమా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. రజనీకాంత్ స్టైల్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రజనీకాంత్ – అనిరుధ్ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ మూవీ మ్యూజిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇంకా రిలీజ్‌కు సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ తమిళ సినీ పరిశ్రమలోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలోనూ ఆసక్తిని రేపుతోంది.
వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ మొదట దర్శకుడు సుందర్ సితో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. దాంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం శిబి చక్రవర్తికి దక్కింది. శిబి చక్రవర్తి 2022లో శివ కార్తికేయన్‌తో తెరకెక్కించిన ‘డాన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఆయనకు ఈ భారీ అవకాశం తెచ్చిపెట్టింది. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. మొత్తంగా, రజనీకాంత్ 173వ సినిమా ప్రకటనతో తమిళ సినిమా ఇండస్ట్రీలో మరోసారి భారీ హీట్ మొదలైందని చెప్పాలి. ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఈ సినిమాను “నెక్స్ట్ ఇండస్ట్రీ షేకింగ్ మూవీ”గా అభివర్ణిస్తున్నారు.