HomeUncategorizedMega 157 | చిరంజీవి కొత్త మూవీకి క‌థానాయిక ఫిక్స్​.. మెగాస్టార్​తో జోడి కట్టనున్న అమ్మడు...

Mega 157 | చిరంజీవి కొత్త మూవీకి క‌థానాయిక ఫిక్స్​.. మెగాస్టార్​తో జోడి కట్టనున్న అమ్మడు ఎవరంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mega 157 | మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న న‌టించిన విశ్వంభ‌ర చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక చిరు- అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా చేయ‌నుండ‌గా, ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. #Mega157 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యుమరస్ రోల్(Humorous role) లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్​తో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది.

Mega 157 | క్రేజీ కాంబో..

సంక్రాంతికి వస్తున్నాం విజయంతో దర్శకుడు #Mega157 ప్రమోషన్స్​కు తన సిగ్నేచర్ టచ్, ఒరిజినాలిటీని తీసుకువస్తున్నారు. ఈరోజు, చిరంజీవికి జోడిగా నయనతార(Nayanthara)ను హీరోయిన్​గా పరిచయం చేయడానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi)న్యూ వీడియోను రిలీజ్ చేశారు. కంప్లీట్ తెలుగులో సూపర్ ఫన్ వీడియో రిలీజ్ చేసి తమ అవైటెడ్ ప్రాజెక్టులోకి ఆహ్వానం పలికారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయనున్నారు. గతంలో చిరు, నయన్ కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జోడికి తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి జంట స్క్రీన్ పై సందడి చేయనుంది.

సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్‌ (God Father) తర్వాత చిరంజీవితో నయనతార మూడవసారి కలిసి పనిచేస్తున్న చిత్రం మెగా157(Mega 157). ఈ యూనిక్ ప్రోమోలో ఆమె కనిపించడం రావిపూడి క్రియేటివిటీకి నిదర్శనం. ఈ వీడియో నయనతార పాత్ర యొక్క హిలేరియస్ నేచర్​ను సూచిస్తుంది. నయనతార కోసం అనిల్ రావిపూడి ఒక అద్భుతమైన పాత్రను రాశారు, ఇది రిఫ్రెషింగ్‌గా, మెమరబుల్​గా ఉంటుంది. చిరంజీవి, నయనతారల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుంది.