HomeUncategorizedAvatar 3 | అవ‌తార్ 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇక ఫ్యాన్స్‌కి పండుగే..!

Avatar 3 | అవ‌తార్ 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇక ఫ్యాన్స్‌కి పండుగే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Avatar 3 | హాలీవుడ్‌లో విజువల్ వండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ‘అవతార్’. దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన పండోరా ప్రపంచం, అందులోని ప్రకృతి అందాలు, రిచ్ గ్రాఫిక్స్‌తో చేసిన విజువల్ మాయాజాలం(Visual Magic) ప్రపంచ ప్రేక్షకులను అబ్బుర‌ప‌రిచాయి. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ద్వారా రెండో భాగంతో మరోసారి మెస్మరైజ్ చేశాడు కామెరూన్. ఇప్పుడు మూడో భాగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) అనే టైటిల్‌తో అగ్ని ఆధారంగా కథ సాగనుంది. అవతార్ 3 కథ మొత్తం కొత్త కోణంలో రానుంది.

Avatar 3 | కొత్త ప్రపంచంలోకి..

మొదటి పార్ట్‌లో భూమి, రెండో భాగంలో సముద్రం, మూడో పార్ట్‌లో చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూడబోతున్నామని ఆ మ‌ధ్య జేమ్స్ కామెరూన్(Director James Cameron) స్వయంగా తెలిపారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారంటూ ఆయ‌న చెప్ప‌డంతో మూవీపై అంచ‌నాలు పెరిగాయి. ఈసారి జేక్ కుటుంబం మానవులతో పోరాడడం కాదని, పండోరాలోని కొత్త తెగల నుంచి వచ్చే కొత్త విలన్లతో తలపడుతుందని సమాచారం. ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం. ఇప్పటివరకు చూపించిన పండోరా కంటే కొత్త ప్రపంచం, కొత్త బలాలు, కొత్త బలహీనతలతో ‘ఫైర్ అండ్ యాష్'(Fire and Ash) రాబోతుంది అని కామెరూన్ అన్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ట్రైలర్​పై ఎంతో ఆసక్తి నెలకొంది. తాజాగా వచ్చిన అప్​డేట్​ ప్రకారం, జూలై 24న విడుదల కానున్న ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ మూవీతో పాటు ఈ ట్రైలర్‌ను వరల్డ్​వైడ్​(Trailer World Wide)గా కొన్ని థియేటర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సినీప్రేమికులు ఈ అప్​డేట్‌తో మైమ‌ర‌చిపోతున్నారు. ఇక మిగతా పార్ట్స్‌కు కూడా షెడ్యూల్ ఫిక్స్ అయింది. అవతార్–3 చిత్రం డిసెంబర్ 19, 2025న విడుద‌ల కానుండ‌గా, అవతార్–4 – 2029లో, అవతార్ 5 – 2031లో రిలీజ్ కానుంది. అవతార్ సిరీస్‌ను పంచభూతాల కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. భూమి, నీటి తర్వాత ఇప్పుడు అగ్ని ఆధారిత యుద్ధం, తదుపరి భాగాల్లో గాలి, ఆకాశం వంటి అంశాలను జేమ్స్ కామెరూన్ విన్యాసాల‌తో చూపించబోతున్నారని అంచనాలు వేస్తున్నారు.