ePaper
More
    HomeసినిమాAllu Arjun - Neel | ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ సినిమా.. ఇంట్రెస్టింగ్...

    Allu Arjun – Neel | ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Allu Arjun – Neel | పుష్ప ఫ్రాంచైజీ చిత్రాల‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌డా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమా చేస్తున్న స‌మ‌యంలోనే బ‌న్నీ త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పుడు బ‌న్నీ ప్రధాన పాత్ర‌లో దిల్ రాజు (Dil raju) ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని ఫిలిం ఇండ‌స్ట్రీలో (Film Industry) జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మధ్య మంచి అనుబంధం ఉంది. ‘ఆర్య’ నుండి ‘పరుగు’, ‘దువ్వాడ జగన్నాథమ్’ వరకు వీరి కలిసి చేసిన సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించాయి.

    Allu Arjun – Neel | క్రేజీ న్యూస్..

    అయితే, కొంత కాలం క్రితం ప్రకటించిన ‘ఐకాన్’ ప్రాజెక్ట్ (Icon project) ఆగిపోయినా, ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Director Prashanth neel) దర్శకత్వం వహించనున్నారు. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ సినిమాతో ఎంత‌టి గుర్తింపు సంపాదించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 (KGF 2) చిత్రాల‌తో ప్ర‌శాంత్ నీల్‌కి డిమాండ్ బాగా పెరిగింది. ఇక ప్రభాస్ హీరోగా ‘సలార్'(Salaar)తో మరొక సూపర్ హిట్ అందుకున్నారు. అయితే స‌లార్ త‌ర్వాత ప్ర‌భాస్‌తో (Prabhas) ‘రావ‌ణం’ చేయాల‌ని ప్ర‌శాంత్ నీల్ అనుకోగా, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి, ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లింది.

    ఈ నేపథ్యంలో, ‘దిల్’ రాజు తాజాగా బన్నీ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంద‌నున్న ‘రావ‌ణం’ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘అట్లీ’ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరోవైపు, ఎన్టీఆర్ హీరోగా (NTR Hero) ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్, ‘సలార్’ సీక్వెల్(salaar Sequeel)ను పూర్తి చేసిన తరువాత ‘రావణం’ సినిమాకు (Ravanam movie) ప‌ట్టాలెక్కిస్తార‌ని ‘దిల్’ రాజు స్పష్టం చేశారు. వీరిద్దరి కలయికలో ‘రావణం’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌కంప‌న‌లు పుట్టించ‌డం ఖాయం అంటున్నారు.

    More like this

    September 6 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 6 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 6,​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...