- Advertisement -
HomeUncategorizedOTT Movies | ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయ‌నున్న సినిమాలివే.. అస్స‌లు మిస్ కాకండి..!

OTT Movies | ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయ‌నున్న సినిమాలివే.. అస్స‌లు మిస్ కాకండి..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: OTT Movies | ప్రతీ వారం థియేటర్లో, ఓటీటీలో కొత్త చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తుంటాయ‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ వారం థియేటర్‌లో హరిహర వీరమల్లు (Hari hara veeramallu) వస్తుందని ఇతర చిత్రాలేవీ బరిలోకి దిగలేదు. కానీ చివరి నిమిషంలో ఈ చిత్రం వాయిదా పడింది. ఇక డేట్ ఖాళీగా ఉందని వద్దామన్నా ఇతర చిత్రాలకు టైం దొరకలేదు. ఇక చిన్నాచితక చిత్రాలు, అందాల రాక్షసి రీ రిలీజ్‌తో ఈ వారం థియేటర్లు(Theaters) సరిపెట్టుకుంటున్నాయి. కానీ ఓటీటీ(OTT)లో మాత్రం ఈ వారం సందడే సందడి అన్నట్టుగా.. వీకెండ్ మొత్తానికి సరిపడా చిత్రాలు వచ్చేశాయి. క్రేజీ సీక్వెల్ అయిన రానా నాయుడు 2 నెట్ ఫ్లిక్స్‌లోకి నేడు వచ్చింది. ఈ సారి బూతులు చాలా తగ్గించేశామని, వయలెన్స్ ఎక్కువ పెట్టామని, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటుందని రానా, వెంకీ మామ ఈ రెండో సీజన్‌ను ప్రచారం చేశారు.

OTT Movies | క్రేజీ చిత్రాలు..

థియేటర్లో మోస్తరుగా ఆకట్టుకున్న సమంత ‘శుభం’ (Subham) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. హాట్ స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. నిర్మాతగా మొదటి ప్రాజెక్ట్ అయిన ‘శుభం’ సమంతకు బాగానే కలిసి వచ్చినట్టుగా సమాచారం. థియేటర్​లో కూడా మంచి రెవెన్యూను రాబట్టినట్టుగా టాక్. ఇతర రైట్స్, డీల్స్‌తోనూ బాగానే లాభపడిందని తెలుస్తోంది. తమిళంలో తన కామెడీ టైమింగ్‌తో సంతానం అందరినీ ఆకట్టుకుంటాడు. డబ్బింగ్ రూపంలోనూ ఇక్కడా సంతానం తెలుగు వారిని నవ్విస్తుంటాడు. ఆయన నటించిన తాజాగా హరర్ కామెడీ చిత్రం డీడీ నెక్ట్స్ లెవెల్ జీ5 లోకి (ZEE 5) నేడు వచ్చేసింది. మరి ఈ చిత్రంలో సెల్వ రాఘవన్, గౌతమ్ మీనన్, సంతానం చేసిన కామెడీ ఏ మేరకు తెలుగు వారిని మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏస్ (తెలుగు మూవీ) – జూన్ 13, ది ట్రైటర్స్(హిందీ టాక్ షో) – జూన్ 12
బ్లైండ్ స్పాట్ (తెలుగు చిత్రం) – జూన్ 13, ఎలెవన్ (తెలుగు చిత్రం) – జూన్ 13 స్ట్రీమ్ కానుండ‌గా, జియో హాట్‌స్టార్​లో శుభం (తెలుగు చిత్రం) – జూన్ 13, కేసరి చాప్టర్ 2(హిందీ చిత్రం) – జూన్ 13 నుంచి స్ట్రీమ్ కానుంది. ఇకఈటీవీ విన్​లో ఆ ఒక్కటి అడక్కు (తెలుగు చిత్రం) – జూన్ 12 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక ఆహాలో ఎలెవన్ (తెలుగు చిత్రం) – జూన్ 13 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, సన్ నెక్స్ట్ లో డియర్ ఉమ (తెలుగు చిత్రం) – జూన్ 13 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక జీ5 లో డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్(తెలుగు డబ్బింగ్ చిత్రం) – జూన్ 13 నుండి స్ట్రీమ్ కానుంది. సోనీ లివ్​లో జింఖానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జూన్ 12 నుండి స్ట్రీమ్ అవుతుంది. అక్షయ్ కుమార్ Akshay kumar కేసరి ఛాప్టర్ 2 హాట్ స్టార్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. నవీన్ చంద్ర లెవెన్ అమెజాన్‌లోకి వచ్చింది. ఈ సినిమాల‌పై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News