అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Constable Murder Case | నగరంలో నడిరోడ్డుపై కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడు రియాజ్‌ను శుక్రవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి పారిపోయాడు.
ఈ ఘటనపై సీపీ సాయిచైతన్య శనివారం స్పందించారు. సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దురదృష్టకరమన్నారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కానిస్టేబుల్ గాయాలపాలైన వెంటనే అతడిని ఎస్సై ఆధ్వర్యంలో ఆస్పత్రికి తరలించామన్నారు.
CP Sai chaitanya | సాయం చేసేందుకు ఎవరూ రాలేదు
దాడి జరిగిన సమయంలో పోలీసులు సాయం కోసం అడిగితే ఎవరూ కూడా ముందుకు రాలేదని సీపీ పేర్కొన్నారు. ఆటోలని ఆపి ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరితే ఎవరూ స్పందించలేదన్నారు. జనమంతా పక్కనే ఉండి ఫొటోలు.. వీడియోలు తీస్తూ ఉన్నారే తప్ప ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు.
పోలీసనే కాకుండా ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉంటే సాయం చేసే గుణం ఉండాలని సీపీ సూచించారు. ఆపద సమయంలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటేనే ప్రాణాలు నిలబడతాయన్నారు. మాకెందుకునే అనే పరిస్థితి ఉండకూడదని వివరించారు.
CP Sai chaitanya | అహోరాత్రులు ప్రజల సేవకే పనిచేస్తున్నాం..
కమిషనరేట్ పరిధిలో పోలీస్‌శాఖ (Nizamabad Police Commissionerate) అహోరాత్రులు కృషి చేస్తోందన్నారు. ఎన్నో నేరాలు జరగకుండా పోలీస్‌శాఖ కట్టడి చేస్తోందన్నారు. అలాగే అనేక నేరాలను ఛేదిస్తున్నామని స్పష్టం చేశారు. ఇలా ఒక క్రైంను ఛేదించే విషయంలోనే ఈ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడు రియాజ్ సైతం అక్కడి నుంచి పారిపోగా.. ఎవరూ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ సాయంచేసే బాధ్యత అలవర్చుకోవాలని సూచించారు. అలా పరోపకారం చేస్తే తిరిగి ఎప్పుడో అది మనకు పనిచేస్తుందని చెప్పారు.