అక్షరటుడే నిజామాబాద్ సిటీ: GGH Nizamabad | జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు (CPR awareness program) నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల (Government Medical College) వైస్ ప్రిన్సిపాల్, ట్రైనర్ జలగం తిరుపతి రావు సీపీఆర్‌పై సిబ్బందికి అవగాహన కల్పించారు.
GGH Nizamabad | హఠాత్తుగా గుండె ఆగినప్పుడు..
హఠాత్తుగా గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ (CPR) ప్రాధాన్యత, ప్రాథమిక జీవన రక్షణ చర్యలు, సమయానికి సరైన విధంగా సీపీఆర్ ద్వారా ప్రాణాలను ఎలా కాపాడవచ్చనే అంశాలను వివరించారు. ప్రాక్టికల్ డెమో ద్వారా ప్రత్యక్షంగా శిక్షణ అందించారు. సిబ్బందికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా, సమర్థవంతంగా స్పందించేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ ద్వారా ఎస్పీఎఫ్ (SPF) సిబ్బందిలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో పాటు, అత్యవసర సందర్భాల్లో ప్రాణరక్షణ చర్యలు చేపట్టే నైపుణ్యం మరింత మెరుగుపడిందని జలగం తిరుపతి రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంవో సాయిరాం, ఎస్పీఎఫ్ ఏఎస్సై సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.