అక్షరటుడే, ఆర్మూర్: Armoor CPM | పార్లమెంట్లో జీరాంజీ బిల్లు (G Ram G Bill) ఆమోదం పొందడాన్ని సీపీఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఖండించింది. ఈ మేరకు పట్టణంలో పీఎం మోదీ (Prime Minister Modi) దిష్టిబొమ్మను పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు.
Armoor CPM | రాజ్యంగ హక్కును హరిస్తున్నారు..
ఈ సందర్భంగా సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి, కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో విపక్షాల నిరసనల మధ్యలో జీ రాంజీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఇది ముమ్మాటికి రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.
Armoor CPM | కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు..
కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం (BJP government) కాంట్రాక్టర్లను ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేసిందని వారు ఆరోపించారు. గ్రామీణ ప్రాంత పెత్తందారులు, కాంట్రాక్టర్లకు మేలు జరిగే విధంగా బిల్లును తీసుకురావడం ఆందోళనకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం 60శాతం మాత్రమే నిధులు ఇస్తామని.. మిగితా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలే ఇచ్చేవిధంగా బిల్లును పొందుపర్చిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు కొండ గంగాధర్, విడగొట్టి సాయిలు, భూమన్న, రవి, కుమార్ కుల్దీ, సాయిలు, ఓంకార్, ఫిరోజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.