ePaper
More
    Homeక్రీడలుCPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకీతో బెదిరించి దోపిడీ

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకీతో బెదిరించి దోపిడీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో ఇద్దరు క్రికెటర్లు, ఒక లీగ్ అధికారి(League Officer)పై దుండగులు తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన క్రికెట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది.

    సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు, ఒక సీపీఎల్ అధికారి సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఈవెంట్ (Private Event) ముగించుకుని హోటల్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మధ్యలో ఆహారం కోసం ఆగినప్పుడు కొందరు దుండగులు వారిని చుట్టుముట్టి తుపాకీతో (Gun) బెదిరించారు. ఆటగాళ్ల వద్ద ఉన్న నగలు, విలువైన వస్తువులను దోచుకున్నారు.

    CPL | పోలీసులు రంగంలోకి..

    ఈ సమయంలో ఒక దుండగుడి తుపాకీ కిందపడిపోయింది. సమాచారం అందుకున్న బార్బడోస్ పోలీసులు (Barbados Police) వెంటనే అక్కడికి చేరుకుని ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఆటగాళ్లు, అధికారి తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

    ఈ ఘటనపై పేట్రియాట్స్ ఫ్రాంచైజీ స్పందిస్తూ.. “మా ఆటగాళ్లు, అధికారి సురక్షితంగా ఉన్నారు. పోలీసుల విచారణకు మేము పూర్తిగా సహకరిస్తున్నాం” అని తెలిపింది. సీపీఎల్ CPL ప్రతినిధి కూడా బాధితుల క్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యం అని పేర్కొన్నారు. విచారణ కొనసాగుతున్నందున బాధితుల పేర్లు గోప్యంగా ఉంచారు. ఈ సంఘటన అనంతరం పేట్రియాట్స్ జట్టుకు (Patriots Team) భద్రతను మరింత పెంచారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 11న కెన్సింగ్‌టన్ ఓవల్ మైదానంలో బార్బడోస్ రాయల్స్‌తో పేట్రియాట్స్ తలపడనుంది. ఏది ఏమైన తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న అంద‌రు ఉలిక్కిప‌డేలా చేసింది.

    More like this

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే,ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును బాగు...

    Megastar Chiranjeevi | చిరంజీవికి ఇప్ప‌టికీ త‌న భార్య అంటే అంత భ‌య‌మా.. కూతురు చెప్పిన సీక్రెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | సెలబ్రిటీలు అయినా, సామాన్యులు అయినా... భార్య ముందు భర్తలు కొంచెం...

    Urea | యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Urea | అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూరియా కోసం తిరిగితిరిగి అలిసిపోయిన అన్నదాతలు రోడ్డెక్కారు....