అక్షరటుడే, వెబ్‌డెస్క్: CPI Kothagudem Victory | కొంతకాలంగా తెలంగాణ (Telangana)లో ఆదరణ కోల్పోతున్న సీపీఐ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది. కొత్తగూడెం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని కొత్తగూడెం ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న సీపీఐ తాజాగా కార్పొరేషన్‌ను గెలుచుకోవడం గమనార్హం. మొత్తం 47 వార్డులు ఉండగా.. సీపీఐ 25, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 2 చోట్ల విజయం సాధించారు. మేయర్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ రావడంతో సీపీఐ నాయకులు (CPI Leaders), కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
CPI Kothagudem Victory | గజ్వేల్‌లో..
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం 14 వార్డులకు గాను 8 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ 5, బీజేపీ ఒకచోట గెలుపొందాయి. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఆమనగల్ మున్సిపాలిటీలో సైతం గులాబీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు గాను బీఆర్ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 1 వార్డుల్లో గెలుపొందాయి.వైరా మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, సీపీఐ 1, సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటింది. గజ్వేల్, దుబ్బాక, తుప్రాన్, చేర్యాల, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది.
1 comment
[…] […]
Comments are closed.