అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad cp | బక్రీద్(Bakrid) సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గాల వద్ద బందోబస్తును సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్, బోధన్‌లోని నర్సిరోడ్డు ఈద్గాలను సీపీ పరిశీలించారు. అనంతరం ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాల వద్ద బందోబస్తును ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను(Police) ఆదేశించారు. సీపీ వెంట ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ రవీందర్, సీఐలు, ఎస్సైలు తదితరులున్నారు.
Nizamabad cp | ఈద్గాల వద్ద బందోబస్తును పర్యవేక్షించిన సీపీ
- Advertisement -
