అక్షరటుడే, వెబ్డెస్క్ : CP Sai Chaitanya | రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలీస్ సిబ్బందిని సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని సాయినగర్ –2 నుంచి హోంగార్డు అల్లం భూమయ్య, తన కూతురు మాధురి (కానిస్టేబుల్)ని విధులకు తీసుకు వెళ్లే సమయంలో ఈ నెల 9న ప్రమాదం జరిగింది.
వీరి బైక్ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. దీంతో భూమయ్య, మాధురి గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీపీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Comments are closed.