Limbadri Gutta
Limbadri Gutta | లింబాద్రి గుట్టపై సీపీ ప్రత్యేకపూజలు

అక్షకటుడే, భీమ్​గల్​: Limbadri Gutta | లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) లక్ష్మీ నృసింహాస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులతో మాట్లాడి ఆలయ వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. లింబాద్రి గుట్ట జాతర (Limbadri Gutta Jatara) సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తు రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్​ డైవర్షన్​ ప్లాన్​ (Traffic diversion plans) చేయాలన్నారు. పార్కింగ్​ ప్రాంతాలను ముందుగానే ప్లాన్​ చేసి.. భక్తులు సాఫీగా గమ్యస్థానాలకు చేరేలా చూడాలన్నారు. భక్తులకు తాగునీరు, వైద్యసాయం, లైటింగ్​ వంటి సౌకర్యాలపై దృష్టి పెట్టాలి.

Limbadri Gutta | భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలి

గుట్టపై భక్తులతో పోలీసు సిబ్బంది స్నేహపూర్వకంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు సరైన దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు. జాతర విజయవంతంగా శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ, స్థానిక సంస్థల అధికారులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సీపీ వెంట భీమ్​గల్​ సీఐ సత్యనారాయణ (Bheemgal CI Satyanarayana), ఎస్సై సందీప్​, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులున్నారు.