అక్షరటుడే, హైదరాబాద్: CP Sajjanar | గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) లో సీపీ సజ్జనార్ తన విధి నిర్వహణ కార్యకలాపాలు ప్రారంభించారు. శనివారం (అక్టోబరు 11) జీహెచ్ఎంసీ GHMC పోలీసులకు పలు సూచనలు చేశారు.
సిటీ పోలీస్ city police విభాగం గత 6 నెలలుగా అద్భుతంగా పనిచేసిందని సీపీ సజ్జనార్ ప్రశంసించారు. అదే ఉత్సాహం, నిబద్ధతతో ముందుకు సాగితే దేశంలో అత్యున్నతస్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు.
CP Sajjanar | చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అసహ్యకరం
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని సిటీ పోలీసులకు సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అసహ్యకరం అని అన్నారు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.