అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Candle rally | పోలీసు అమరవీరుల వారోత్సవాల (Police Martyrs Week) సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని కోర్టు వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(Police Commissioner Sai Chaitanya) క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు.
ప్రధాన వీధుల మీదుగా క్యాండిల్ ర్యాలీ పోలీస్ గ్రౌండ్లోని అమరవీరుల స్థూపం వద్ద వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను ఎల్లవేళలా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీలు ప్రసాద్, శ్రీనివాస్ రాజ్, సురేష్, తిరుపతి, ఎస్సైలు రఘుపతి, శ్రీకాంత్, హరిబాబు, వెంకట్రావు, గంగాధర్, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు షకీల్ పాషా ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

 
 