అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Panchayat Elections | పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శనివారం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) నిజామాబాద్ డివిజన్లోని పలు పోలింగ్ బూత్‌లను పర్యవేక్షించారు.
Panchayat Elections | మాక్లూర్‌లో..
మాక్లూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం స్కూల్ (ZPHS Urdu Medium School) పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ ఏర్పాట్లను సీపీ స్వయంగా పర్యవేక్షించారు. పోలింగ్ బూత్‌లకు సంబంధించిన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌లలో (polling booths) పోలీస్ బందోబస్తు, భద్రత ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Panchayat Elections | భద్రతా నియమాలు పక్కాగా..
ఎన్నికల సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన పహారా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, సంబంధిత అధికారులు ఉన్నారు.