అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | నగరంలోని ఖలీల్వాడిలో డాక్టర్ విశాల్ పిల్లల మనోవికాస కేంద్రాన్ని (Children’s Mental Development Center) సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya ) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి రోజుల్లో టెక్నాలజీ కారణంగా చిన్నారుల్లో బుద్ధిమాంద్యం ఏర్పడుతోందని.. ఆలోచన సరళి మారుతోందన్నారు. దీంతో పిల్లల్లో అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
వీటిని పరిష్కరించేందుకు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ (neuro-psychiatrist Dr. Vishal) మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. అనంతరం సీపీ సాయిచైతన్యను డాక్టర్ విశాల్ సన్మానించారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను డాక్టర్ రవీంద్రారెడ్డి, డాక్టర్ టీ జీవన్ రావు, డాక్టర్ వై శ్రీధర్ రాజు, డాక్టర్ వి జార్జి రెడ్డి, డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ రమేణేశ్వర్, డాక్టర్ కప్పల రాజేష్, అడ్వకేట్ ఆర్ జగదీశ్వరరావు, ఎం సిద్దయ్య, డాక్టర్ కె రాజేష్, డాక్టర్ పి.బి.కృష్ణమూర్తి, డాక్టర్ కౌలయ్య తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ విశాల్ సతీమణి డాక్టర్ నాగ పద్మ, ప్రముఖ వైద్యులు, ఆయా సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.