అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) ను హత్య చేసిన నిందితుడు రియాజ్ (Riyaz) ను పట్టించే క్రమంలో గాయపడిన యువకుడు సయ్యద్ ఆసిఫ్‌ను శుక్రవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పరామర్శించారు.
రూరల్ పోలీస్ స్టేషన్ Rural Police Station పరిధిలోని రామ్‌నగర్‌లో ఉన్న ఆసిఫ్ ఇంటికి సీపీ వెళ్లారు. యువకుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
CP Sai Chaitanya | బాబుతో సరదాగా..
ఆసిఫ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భవిష్యత్తు గురించి భరోసా కల్పించారు. ఆసిఫ్ కొడుకు అయాన్‌ను సీపీ ఎత్తుకుని తుంహారా పప్పా బహదూర్ హై అని కొనియాడారు.
సీపీ వెంట నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, రూరల్ ఎస్సై ఎమ్ డీ ఆరిఫ్, టౌన్ 6 ఎస్సై వెంకట్ రావు తదితరులు ఉన్నారు.
