అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో పొందుపర్చాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం సీపీ ప్రకటన విడుదల చేశారు. ప్రతిఒక్కరూ పర్యావరణ అనుకూలమైన వినాయక చవితి (Vinayaka chavithi) జరుపుకోవాలని, గణేష్ మండళ్ల (Ganesh Mandals) వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Cp Sai chaitanya | మండపాల నిర్వాహకులు సహకరించాలి
సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసుశాఖకు సహకరించాలని సీపీ పేర్కొన్నారు. ఉత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహించుకోవడంలో పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) భక్తులకు పూర్తిగా సహకరిస్తుందన్నారు. అలాగే మండళ్ల నిర్వాహకులు సైతం నియమనిబంధనలు పాటించాలని సూచించారు.
Cp Sai chaitanya | పాయింట్ బుక్ ఏర్పాటు..
ఈనెల 27న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అన్ని గణేష్ మండపాలకు సెక్యూరిటీ ఇచ్చేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందని సీపీ తెలిపారు. దీనికోసం పాయింట్ బుక్ ఏర్పాటు కోసం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లోని అన్ని గ్రామాల్లోని గణేష్ మండపాల నిర్వాహకులు http://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు.
Cp Sai chaitanya | విగ్రహ తయారుదారులకు విజ్ఞప్తి
ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని.. విగ్రహ తయారీదారులందరూ సేంద్రీయ పాయింట్లు వాడాలని సీపీ సాయి చైతన్య సూచించారు. మండపాల నిర్వాహకులు అగ్ని ప్రమాదం సంభవిస్తే, వర్షం కురిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.