Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

Nizamabad CP | పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

పోలీస్​ ప్రజావాణి కార్యక్రమాన్ని సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. సీపీ సాయిచైతన్య ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించాలని పోలీస్ అధికారులను సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశించారు. నిజామాబాద్​ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీస్​ ప్రజావాణి కార్యక్రమాన్ని సీపీ నిర్వహించారు.

Nizamabad CP | సమస్యలు వింటూ పరిష్కారం చూపుతూ..

ఫిర్యాదుదారుల సమస్యలను సీపీ సాయిచైతన్య ఓపికగా విన్నారు. వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు వెంటవెంటనే ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు.

Nizamabad CP | నేరుగా కలవొచ్చు..

ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని సీపీ పేర్కొన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీపీ వివరించారు. ఈ మేరకు సోమవారం 20 ఫిర్యాదులు స్వీకరించారు.

Must Read
Related News