అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఘన విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఫలితాలు విడుదల అయ్యాయి.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏన్డీఏ (NDA) నుంచి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పోటీ చేయగా.. ఇండి కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Justice Sudarshan Reddy) బరిలో నిలిచారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 788 మంది ఎంపీలు ఉండగా.. 767 మంది ఓటు వేశారు. ఇందులో 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించారు. ఇండి కూటమి అభ్యర్థికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 15వ ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నిక అయ్యారు. కాగా ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు దూరంగా ఉన్నాయి.
Vice President | రాధాకృష్ణన్ నేపథ్యం..
సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. 1957 మే 4న తమిళనాడులోని తిరుప్పూరులో ఆయన జన్మించారు. కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 1998, 1999 లో ఆయన ఎంపీగా గెలిచారు. 2004, 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు ఛైర్మన్‌గా కూడా పని చేశారు. 2023 ఫిబ్రవరి 12న ఆయన జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జులై 27న మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఆర్ఎస్ఎస్తో సైతం మంచి అనుబంధం ఉంది. 17 ఏళ్ల వయసు నుంచే ఆర్ఎస్ఎస్లో ఆయన క్రీయాశీలక సభ్యుడిగా ఉన్నారు.