ePaper
More
    HomeజాతీయంVice President | ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌.. ఇంతకీ ఎవరీయన

    Vice President | ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌.. ఇంతకీ ఎవరీయన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Vice President | ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ (NDA) ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన బీజేపీ (Tamil Nadu Bjp) సీనియర్​ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ (Maharashtra Governor )​గా పని చేస్తున్నారు. గతంలో తెలంగాణ గవర్నర్ గానూ సేవలందించారు.

    జగదీప్​ ధన్​ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. దీంతో ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం (Election Commission) నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 21లోగా నామినేషన్​ వేయాల్సి ఉంటుంది. దీంతో ఎన్డీఏ తన అభ్యర్థిని ఖరారు చేసింది. అయితే ఉపరాష్ట్రపతి పదవి రేసులో పలువురు ఉన్నట్లు అనేక పేర్లు వినిపించాయి. కాగా.. ఎన్డీఏ అనుహ్యంగా మహారాష్ట్ర గవర్నర్​ సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan)ను అభ్యర్థిగా ఖరారు చేసింది.

    Vice President | ఆయన నేపథ్యం

    రాధాకృష్ణన్​ తమిళనాడులోని తిరుప్పూర్​లో జన్మించారు. కోయంబత్తూర్​ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 1998, 1999 లో ఆయన ఎంపీగా గెలిచారు. 2004, 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు ఛైర్మన్​గా కూడా పని చేశారు.

    2023 ఫిబ్రవరి 12న ఆయన జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 2024 జులై 27న మహారాష్ట్ర గవర్నర్​గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

    బీహార్​లో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్​​ వైపు బీజేపీ మొగ్గు చూపింది.

    Latest articles

    Muslim girl..get Rs. 5 lakh | ముస్లిం అమ్మాయిని పెళ్లాడితే రూ. 5 లక్షలు ఇస్తా : ఎమ్మెల్యే పాటిల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Muslim girl..get Rs. 5 lakh : ముస్లిం అమ్మాయిలను వివాహం చేసుకునే హిందూ యువకులకు...

    Eye problems | రెటీనా సమస్యలతో కంటి చూపు మందగిస్తోందా?

    అక్షరటుడే, హైదరాబాద్: Eye problems | కంటి చూపు మందగించడం అనేది వయసు పైబడిన వారిలో సాధారణంగా కనిపించే...

    locking the door.. stealing | ఇంట్లో నిద్రిస్తుండగానే.. డోర్​కు గడియపెట్టి.. చోరీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: locking the door.. stealing | నిజామాబాదులో దొంగలు విరుచుకుపడుతున్నారు. నగరంలోని పోలీసుల పెట్రోలింగ్,...

    PV Sindhu | ఆరోగ్య పరీక్షలను కీలకంగా చూడాలి : పీవీ సింధు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PV Sindhu | ఆరోగ్య పరీక్షలను కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో...

    More like this