అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | పోలీసు సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. ఇందులో భాగంగా రానున్న చలికాలం నేపథ్యంలో పోలీసు సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకుగాను అవసరమైన రక్షణ దుస్తులు అందజేశారు.
సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి వులెన్ జాకెట్లు (woolen jackets), హావర్ సాక్స్‌లు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చలికాలం సమీపిస్తున్న సందర్భంగా పోలీసు సిబ్బంది వులెన్ జాకెట్లు వినియోగించాలని సూచించారు. విధి నిర్వహణలో వీటిని వెంట ఉంచుకోవాలని, అవసర నిమిత్తం ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌బీ ఎస్సై సంతోష్ రెడ్డి, ఆర్ ఎస్సైలు నిషిత్, సుమన్ పాల్గొన్నారు.