అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | నిజామాబాద్ (Nizamabad) సీపీ సాయి చైతన్య కంఠేశ్వర్ (Kanteshwar)లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసంలో చివరి శనివారం కావడంతో నీలకంఠేశ్వర ఆలయంలో వెలసిన ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. తెల్లవారుజాముననే ఆలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అభిషేకం, అర్చనలు చేశారు.
