అక్షరటుడే, ఇందూరు: nominal roll : నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్టేషన్‌లకు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కానిస్టేబుళ్లు (PCs), హెడ్ కానిస్టేబుళ్లు (HCs), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ASIs) సహా ఇతర స్టేషన్లు, కార్యాలయాలు, అనుబంధ శాఖలకు అటాచ్ అయిన వారి వివరాలతో కూడిన నామినల్రోల్ను (Nominal Rolls) నేడు (మే 2వ తేదీ) తప్పనిసరిగా సమర్పించాలని సీపీ స్పష్టం చేశారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIs), అసిస్టెంట్ కమిషనర్లు (ACSPs) ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.