అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad CP | నందిపేట మండలం ఉమ్మడ వంతెన (Ummeda bridge) వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన స్థలాన్ని శనివారం సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పరిశీలించారు. నిమర్జన ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్, క్రేన్, వైద్య సదుపాయాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్ల వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
Nizamabad CP | శాంతియుతంగా జరుపుకోవాలి
వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని సీపీ ఈ సందర్భంగా సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని.. యువత సంయమనం పాటించాలన్నారు. వంతెన ప్రాంతంలో నది ఉధృతంగా ప్రవహిస్తోందని.. ఏరికోరి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని ఆయన సూచించారు. 24 గంటలు వంతెన వద్ద నిఘా ఉంచాలని నందిపేట పోలీసులను (Nandipet police) సీపీ ఆదేశించారు. ఆయన వెంట నందిపేట ఎస్సై శ్యాం రాజు, సిబ్బంది తదితరులున్నారు.