అక్షరటుడే,ఆర్మూర్: CP Inspects Polling in Armoor | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) భాగంగా పోలింగ్ బూత్‌లకు వచ్చే ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. ఈ మేరకు ఆర్మూర్ పట్టణంలోని పలు పోలింగ్ సెంటర్లను ఆయన తనిఖీ చేశారు.
CP Inspects Polling in Armoor | నియమాలను పక్కాగా అమలు చేయాలి..
ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) పరిధిలోని ఆయా పోలింగ్ బూత్‌లను పరిశీలించిన అనంతరం సీపీ మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బంది అసలత్వం వహించరాదన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలను తప్పకుండా ప్రతిఒక్కరూ పాటించాలని తెలియజేశారు.
కట్టుదిట్టమైన భద్రత..
పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని సీపీ తెలిపారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయం (Armoor Mandal Parishad Office), సంతోష్ నగర్‌లోని విద్య హైస్కూల్లో పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్మూర్ ఏసీపి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, ఏఆర్వో భూమేశ్వర్ తదితరులున్నారు.