9
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. మొదటి విడతలో భాగంగా బోధన్ నియోజవర్గం (Bodhan Constituency)లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కాగా.. నవీపేట్ పోలీస్ స్టేషన్ (Navipet Police Station) పరిధిలోని బినోల గ్రామ పంచాయతీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య (CP Sai Chaitanya) పరిశీలించారు.
నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకున్నారు. నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీటర్లలోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎస్సైలు తిరుపతి, యాదగిరి గౌడ్, ప్రొసీడింగ్ ఆఫీసర్ కె.అనిత, సిబ్బంది ఉన్నారు.