Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | ఆర్మూర్‌ గుండ్ల చెరువును పరిశీలించిన సీపీ

CP Sai Chaitanya | ఆర్మూర్‌ గుండ్ల చెరువును పరిశీలించిన సీపీ

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్‌ : CP Sai Chaitanya | పట్టణంలోని గుండ్ల చెరువును సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదివారం పరిశీలించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించాలని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆర్మూర్‌ పోలీసులకు (Armoor Police) సూచించారు.

గుండ్ల చెరువు (Gundla Cheruvu) వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేటింగ్, లైటింగ్, డ్రాన్‌ ప్రూఫ్‌ జాకెట్లు, రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సీపీ వెంట ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, పోలీస్, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.