అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaithanya | గణేశ్ నిమజ్జనం (Ganesh immersion) సందర్భంగా నిర్వహిస్తున్న ప్రదేశాలను సీపీ సాయిచైతన్య పర్యవేక్షించారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి స్వయంగా కొద్దిదూరం బైక్ నడుపుతూ వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.
బాసర (basara), ఉమ్మడి బ్రిడ్జి, బోధన్ (Bodhan), బోర్గాం తదితర ప్రదేశాలను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేందుకు పోలీస్‌శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు.
CP Sai Chaithanya | కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం..
నిమజ్జక కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు సీపీ సాయిచైతన్య వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతాపరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలందరూ పోలీసులకు సహకారాన్ని అందించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. నిమజ్జన వేడుకను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని తెలిపారు. సీపీ వెంట ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు మరియు బందోబస్తు సిబ్బంది ఉన్నారు.