అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను (traffic problems) తీర్చాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మూడునెలల క్రితం ఖలీల్‌వాడీ, దేవిరోడ్లను వన్‌వే చేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
Nizamabad CP | క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ..
ఈ సందర్భంగా దేవిరోడ్లో (Devi Road) రాకపోకలను సీపీ సాయిచైతన్య గురువారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలినడకన గంజ్ నుంచి దేవిరోడ్డు చివరి వరకు కాలినడకన పర్యటించారు. అలాగే ప్రజలతో మాట్లాడారు. వన్‌వే కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా.. ప్రయోజనం ఉందా అని వివరాలు సేకరించారు.
Nizamabad CP | దేవిమాత ఆలయ భక్తుల పార్కింగ్..
దేవిరోడ్డులో వస్తువులు కొనడానికి వచ్చే వారితో సైతం సీపీ మాట్లాడారు. అలాగే ఆ రోడ్డులో ఉన్న దేవిమాత ఆలయానికి (Devi Mata temple) వచ్చే భక్తులు తమ వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారని ట్రాఫిక్ సిబ్బందిని అడిగారు. అలాగే సెల్లార్లలో వ్యాపారాల నిర్వహణపై ఆరా తీశారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali), ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
