అక్షరటుడే, భీమ్‌గల్: CP Sai Chaitanya | జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను గుర్తించేందుకు పోలీస్‌శాఖ (Police department) కసరత్తు చేస్తోంది. వీటిని గుర్తించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు.
CP Sai Chaitanya | కమ్మర్పల్లి జాతీయ రహదారిపై..
కమ్మర్పల్లి (Kammarpally) జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు మంగళవారం సీపీ సాయి చైతన్య ప్రమాద ఘటనాస్థలాలను పరిశీలించారు. గతంలో జరిగిన ప్రమాదాల వివరాలు తెలుసుకున్నారు.
ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు (Armoor ACP Venkateshwarlu), ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ (ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ), భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ (Bheemgal CI Satyanarayana), ఆర్అండ్బీ, ఆర్టీఏ(RTA), ఎన్హెచ్ఈఏ, పంచాయతీ అధికారులు ఉన్నారు.