74
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ (Constable Pramod Kumar) అక్టోబర్ 10న విధి నిర్వహణలో రౌడీషీటర్ చేతిలో హతమైన విషయం తెలిసిందే. పోలీస్ సాలరీ ప్యాకేజ్ (Police Salary Package) వర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రూపంలో రూ.కోటి చెక్కు మంజూరైంది.
ఈ చెక్కును సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) కానిస్టేబుల్ సతీమణి ప్రణీత కుటుంబానికి గురువారం సీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సీహెచ్ రవికిరణ్, రీజినల్ మేనేజర్ మహేశ్వర్, చీఫ్ మేనేజర్ సోమేశ్వర్ రావు, ఎస్బీఐ గంగాస్థాన్ బ్రాంచ్ మేనేజర్ ఎన్.శ్రీవిద్య, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.