3
అక్షరటుడే, వెబ్డెస్క్ : CP Sai Chaitanya | నిజామాబాద్ (Nizamabad) నగరంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీచౌక్, నెహ్రూ పార్క్, శివాజీ నగర్, కంఠేశ్వర్, దేవీ రోడ్డు, ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ప్రశ్నించారు. అలాగే ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రి పూట అనవసరంగా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.