అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Sai Chaitanaya | నూతన సంవత్సర వేడుకల (New Year celebrations)ను పురస్కరించుకొని నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అనాథాశ్రమాలను సందర్శించారు. అక్కడి పిల్లలతో వేడుకలను జరుపుకున్నారు. పిల్లలకు నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మమేకమై, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు. పిల్లలు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
CP Sai Chaitanaya | బాలసదన్‌లో..
చిల్డ్రన్స్ హోమ్ (Children’s Home) ఫర్ గర్ల్స్ (బాల సదన్), శిశు గృహ స్పెషలైజ్ అడాప్షన్ సెంటర్, హియరింగ్ ఎంపెయిర్ అనాధశ్రమాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి బస్వారెడ్డి, నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్ కుమార్, మూడో టౌన్ ఎస్సై హరిబాబు, అనాథ ఆశ్రమాల సూపరింటెండెంట్లు వినోద, శోభారాణి, అనిత తదితరులు పాల్గొన్నారు.