HomeUncategorizedCow Price | ఏంటీ.. ఈ ఆవు ధ‌ర అక్ష‌రాలా రూ.10 ల‌క్ష‌లా.. అంత స్పెషాలిటీ...

Cow Price | ఏంటీ.. ఈ ఆవు ధ‌ర అక్ష‌రాలా రూ.10 ల‌క్ష‌లా.. అంత స్పెషాలిటీ ఏంటి?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cow Price | ఓ ఆవు ధర ఏకంగా అక్షరాలా రూ.10 లక్షలు(10 Lakhs) పలికింది అని తెలిసి ఉలిక్కిప‌డుతున్నారు. అదేంటి ఆవు ధర ఏకంగా లక్షల్లో పల‌క‌డం వెన‌క ఏదైనా స్పెషాలిటీ(Cow Speciality) త‌ప్ప‌క ఉండే ఉంటుందని కొంద‌రు ఆలోచ‌న చేస్తున్నారు. అవును మీరు అనుకున్న‌ది నిజ‌మే. ఈ ఆవు చాలా స్పెషల్. రెండు పూటలా ఎక్కువ పాలు ఇస్తుందట.. అందుకే ఈ ఆవుకు మంచి డిమాండ్ ఉందంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) రామన్నపేట మండలంలోని లక్ష్మాపురంలో గుమ్మి రామిరెడ్డి (ఎలక్ట్​ ఆఫ్​ క్రెడాయ్ నేషనల్​ – ప్రెసిడెంట్) నాలుగున్నరేళ్ల క్రితం గుజరాత్​లోని రోజ్కో​ట్​ నుంచి రెండు గిర్​ జాతి ఆవులను(Gir breed cows) తెప్పించి గోశాల ప్రారంభించారు.

Cow Price | మంచి డిమాండ్..

ప్రస్తుతం గోశాలలో 132 గిర్​ అవులున్నాయి. ఈ ఆవు ఉదయం, సాయంత్రం 8 లీటర్ల చొప్పున మొత్తం 16 లీటర్ల పాలు ఇస్తుంది. కాగా.. ఈ ఆవును ఏపీలోని సత్యసాయి జిల్లా(Sathya Sai District)లోని పెనుగొండకు చెందిన హెబ్బేవ్ గోశాల నిర్వాహకుడు అమిత్ ​కిషన్ రూ.10 లక్షలకు కొనుగోలు చేశాడు. ఆదివారం ఈ ఆవును వాహనంలో పెనుగొండకు తరలించారు. అయితే రామిరెడ్డి నాలుగున్నరేళ్ల క్రితం గుజరాత్‌లోని రాజ్కోట్‌(Gujarat Rajkot) నుంచి రెండు గిర్‌ జాతి ఆవులను తెప్పించారు.. యాదాద్రి జిల్లాలో గోశాలను ప్రారంభించారు. అలా రెండు గిర్ ఆవులతో ప్రారంభమై.. ప్రస్తుతం ఇక్కడ 132 గిర్‌ ఆవులున్నాయి.

మన దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా గిర్ ఆవులకు గుర్తింపు ఉంది. గిర్ ఆవుల చర్మం ఎరుపు రంగులో ఉంటుంది. కొన్ని ఆవులు నలుపు, తెలుపు, గోల్డ్ కలర్‌లో కూడా ఉంటాయి. ఈ ఆవులు ఏకంగా 400 కేజీల వరకు బరువు ఉంటాయి. గిర్ ఆవుల చెవులు పొడవుగా ఉంటాయి.. ఈ గిర్ ఆవులు రోజుకు 10 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. కొన్ని ఆవులైతే ఏకంగా 22 నుంచి 28 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఈ ఆవు పాలు చాలా మంచిదని చెబుతుంటారు. ఈ ఆవులు అత్యధిక ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకుంటాయ‌ని అంటున్నారు. గిర్ ఆవు పాలకు మంచి డిమాండ్ ఉంటుంది కాబ‌ట్టే రైతులు(Farmers) వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారట.