అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Covid Vaccine | ప్రపంచ వ్యాప్తంగా కరోనా(Corona) మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. కోవిడ్ దాటికి కొన్ని రోజులు ప్రపంచం అంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. లాక్డౌన్లతో ప్రజలు ఎక్కడికక్కడే స్తంభించిపోయారు. కరోనా మహమ్మారి దాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం ప్రజలకు కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) వేసింది. అయితే వ్యాక్సిన్ వేసుకోవడంతో ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధ్యయంన చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ(Union Health Ministry) కీలక ప్రకటన చేసింది.
కరోనాకు ముందు దేశంలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉండేవి. కోవిడ్ తర్వాత ఇవి పెరిగాయి. ముఖ్యంగా యువత అప్పటికప్పుడే కూలబడి చనిపోతారు. డ్యాన్స్ చేస్తూ.. క్రికెట్ ఆడుతూ.. పాటలు పాడుతూ ఎంతో మంది కూలిపోయారు. విద్యార్థులు సైతం గుండెపోటుకు గురికావడం గమనార్హం. దీంతో కోవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine)లతోనే ఆకస్మిక గుండెపోట్లు పెరిగాయనిక ప్రచారం జరిగింది. తక్కువ వ్యవధిలో.. పూర్తిగా పరీక్షలు చేయకుండా వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవడంతో ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపించారు.
Covid Vaccine | మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్తోనే మరణాలు
వ్యాక్సిన్ కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయని ప్రచారం జరగడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఐసీఎంఆర్, ఎయిమ్స్‌తో అధ్యయనం చేయింది. ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని ఈ అధ్యయనం తేల్చింది.
మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (Myocardial Infarction)తోనే యువత ఉన్నటుండి మరణిస్తున్నారని ప్రాథమికంగా గుర్తించారు. దీనికితోడు అంతర్లీన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర జీవనశైలితో మరణాలు పెరుగుతున్నాయని అధ్యయన బృందం తెలిపింది. జన్యుపరమైన సమస్యలతోనే ఎక్కువగా ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.