అక్షరటుడే, వెబ్‌డెస్క్: Covid – 19 : కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. సింగపూర్(Singapore), హాంకాంగ్(Hong Kong) తోపాటు భారత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ముంబయి(Mumbai)లో కరోనా సోకి ఇద్దరు మృతి చెందారు.
అక్కడి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి(King Edward Memorial Hospital)లో 14 ఏళ్ల బాలుడు, 54 ఏళ్ల వ్యక్తి కొవిడ్ బారిన పడి మరణించారు. కాగా, వారిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.