HomeతెలంగాణCovid | మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా.. ప‌లు రాష్ట్రాల‌లో భారీగా కేసులు న‌మోదు

Covid | మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా.. ప‌లు రాష్ట్రాల‌లో భారీగా కేసులు న‌మోదు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Covid | గ‌తంలో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసిన క‌రోనా(Corona) ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాల్లో కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తి అధికంగా ఉంటోంది. ఇప్పుడు మిగ‌తా దేశాల‌కు కూడా మెల్ల‌గా క‌రోనా స్ప్రెడ్ అవుతుంది. దేశంలోనూ కరోనా వ్యాప్తి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. అదే సమయంలో, దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ (Corona Virus) తీవ్రం కాకపోయినా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా మహమ్మరి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కూడా కలకలం రేపుతోంది. విశాఖపట్టణంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయనే వార్తలతో ఆందోళన నెలకొంది.

Covid | క‌రోనా క‌ల‌క‌లం..

కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(Government of Andhra Pradesh) అప్రమత్తమైంది. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని.. సీజనల్‌ వ్యాధులు వస్తున్న క్రమంలో కేసుల నమోదు పెరుగుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు పాటించాల్సిన నియమ నిబంధనలు విడుదల చేసి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రార్థన సభలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, శుభకార్యాలు వంటి అన్ని రకాల గుంపుల సమావేశాలను నివారించాలి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, Bus Stand ఎయిర్‌పోర్ట్స్‌లో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వయసు పైబడినవారు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణులు ఇంటి నుంచి బయటకు రావడం నివారించాలి.

శుభ్రత పాటించాలి. చేతులు తరచూ కడగాలి, తుమ్మినప్పుడు కవర్ చేయాలి. చేతితో ముఖాన్ని తాకకుండా ఉండాలి. జన సమూహాల్లో లేదా వెంటిలేషన్ లేకుండా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్(Mask) ధరించాలి. కోవిడ్ లక్షణాలు ఉంటే తప్పక పరీక్ష చేయించుకోవాలి. అనారోగ్యంగా ఉన్న వారు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను రక్షించాలి. ప్రభుత్వం వైద్యశాఖకు సూచించిన ప్రకారం మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు 24/7 ల్యాబ్స్‌లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క ముంబై నగరంలోనే మే నెలలో 95 కొత్త కోవిడ్ కేసులు(Covid Cases) నమోదయ్యాయి. జనవరి January నుంచి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 106 కేసుల్లో ఇవి అత్యధికం కావడం గమనార్హం. తమిళనాడు(Tamil Nadu)లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలో 16 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు(Dinesh Gundu Rao) ధృవీకరించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఒక్కరోజే ఏకంగా ఏడు కొత్త కేసులు బయటపడ్డాయి.