అక్షరటుడే, ఇందూరు: Court Notice | జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు పీఏగా కొనసాగుతున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారికి హ్యూమన్ రైట్స్ కోర్టు (Human Rights Court) నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పీఏగా విధులు నిర్వహించడం పట్ల మోపాల్ మండలం (Mopal mandal) సిర్పూర్‌కు చెందిన గోపాల్ ఇప్పటికే అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రెండేళ్లుగా పీఏగా విధులు నిర్వహిస్తున్నారంటూ ప్రజావాణితో పాటు డీఈవోకు పలుసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఇటీవల హ్యూమన్ రైట్స్ కోర్టుకు ఫిర్యాదు వెళ్లగా.. తాజాగా నోటీసులు జారీ చేశారు. నవంబర్ 25వ తేదీ లోపు డీఈవో, ధర్పల్లి ఎంఈవో (Dharpally MEO), ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.
Court Notice | నోటీసులు చూడలేదు.. అశోక్, డీఈవో
నోటీసులపై డీఈవో అశోక్‌ను (DEO Ashok) వివరణ కోరగా.. తాను సెలవులో ఉండడం వల్ల నోటీసులు చూడలేదన్నారు. ఉపాధ్యాయులు పీఏలుగా పనిచేయడం నిబంధనలకు విరుద్ధమేనన్నారు. అయితే సదరు ఉపాధ్యాయుడు ప్రతి నాలుగు నెలలకోసారి ఎంఈవో వద్ద సెలవులు పెడుతున్నాడని వివరించారు.
