అక్షరటుడే, భీమ్‌గల్: Panchayat Elections | భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Grama Panchayat Elections) అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్ (Sarpanch and Deputy Sarpanch) పదవులను కైవసం చేసుకుని గ్రామాభివృద్ధిలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
Panchayat Elections | భారీ మెజారిటీతో విష్ణువర్ధిని గెలుపు
బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాచకొండ విష్ణువర్ధిని తన సమీప ప్రత్యర్థిపై 1,334 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గ్రామంలో ఆమె పట్ల ఉన్న ఆదరణ, పార్టీ శ్రేణుల సమష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Panchayat Elections | ఉపసర్పంచ్‌గా శంకర్ గౌడ్..
మరోవైపు సర్పంచ్ భర్త రాచకొండ శంకర్ గౌడ్ 11వ వార్డు నుంచి పోటీ చేసి విజేతగా నిలిచారు. బడా భీమ్‌గల్‌లోని మొత్తం 12 వార్డులకు గాను.. బీఆర్ఎస్ మద్దతుదారులు 9 స్థానాలు, కాంగ్రెస్ మద్దతుదారులు 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. మెజారిటీ వార్డు సభ్యుల మద్దతు ఉండడంతో శంకర్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో భార్య సర్పంచ్‌గా, భర్త ఉపసర్పంచ్‌గా గ్రామాన్ని నడిపించనున్నారు.
Panchayat Elections | సంబరాల్లో కార్యకర్తలు
దంపతులిద్దరూ కీలక పదవులను చేపట్టడంతో బడా భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అందరినీ కలుపుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు.