Homeతాజావార్తలుHyderabad | రోడ్డుపై ఆటోలో రెచ్చిపోయిన జంట.. షాకిచ్చిన పోలీసులు

Hyderabad | రోడ్డుపై ఆటోలో రెచ్చిపోయిన జంట.. షాకిచ్చిన పోలీసులు

నడి రోడ్డుపై అందరు చూస్తుండగా ఓ జంట ఆటోలో రొమాన్స్​ చేసింది. ఆ వీడియో వైరల్​ కావడంతో డ్రైవర్​కు పోలీసులు షాక్​ ఇచ్చారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఇటీవల కొందరు రెచ్చిపోతున్నారు. పబ్లిక్​లో రొమాన్స్​ చేస్తున్నారు. నలుగురు చూస్తున్నారనే సోయి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. సోషల్​ మీడియా (Social Media)లో ఫేమస్​ కావడానికి మరికొందరు వాహనాల మీద సైతం రొమాన్స్​ చేస్తున్నారు.

సోషల్​ మీడియాలో ఫేమస్​ కావడానికి కొందరు బరితెగిస్తున్నారు. బైక్​లపై, కార్లలో రొమాన్స్​ చేస్తున్నారు. అది కూడా ప్రమాదకరంగా డ్రైవింగ్​ చేస్తూ ఇతరుల ప్రాణాలను రిస్క్​లో పెడుతున్నారు. తాజాగా ఓ జంట ఆటోలో రొమాన్స్​ చేసింది. డ్రైవర్​ తనపై యువతిని కూర్చొపెట్టుకొని రొమాన్స్ చేస్తూ ఆటో నడిపాడు. ప్రమాదకరంగా డ్రైవింగ్​ చేస్తున్న అతడిని పలువురు వీడియో తీశారు. రోడ్డుపై వెళ్తున్న వారు వీడియో తీస్తున్న ఆ జంట తమ పనిని ఆపకపోవడం గమనార్హం. హైదరాబాద్‌ నగరంలోని చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాదర్‌ఘాట్‌ (Chadarghat) బ్రిడ్జి మీదుగా వెళ్తూ ఏకంగా ఆటోలోనే డ్రైవర్ సీటులో అందరూ చూస్తుండగా రొమాన్స్ చేశారు.

 Hyderabad | మైనర్​గా గుర్తించిన పోలీసులు

ఆటోలో రొమాన్స్​ చేస్తున్ వీడియో వైరల్​ (Video Viral) కావడంతో పోలీసులు స్పందించారు. సదరు ఆటో డ్రైవర్​ను పట్టుకున్నారు. అతడిని మైనర్​ (17)గా గుర్తించారు. అతడిది నల్గొండ అని తెలిపారు. సదరు యువకుడితో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్​ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు (Traffic Regulations) ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మైనర్లు వాహనాలు నడపడమే నేరం. అలాంటిది ఆ యువకుడు ఏకంగా ఆటో నడుపుతూ రొమాన్స్​ చేయడం గమనార్హం. ఇలాంటి వారితో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సదరు యువకుడిపై పబ్లిక్​ న్యూసెన్స్​, ప్రమాదకర డ్రైవింగ్​ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Must Read
Related News