అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad city | నిజామాబాద్ నగరంలో దంపతుల సూసైడ్ కలకలం రేపింది. దంపతులిద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. గాయత్రి నగర్లో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. మృతులు బొలిశెట్టి శ్రీనివాస్(53), బొలిశెట్టి మమత(48)గా పోలీసులు గుర్తించారు. తాము నివాసం ఉండే ఇంట్లోనే వేరు బలవన్మరణం చేసుకున్నారు. నగర సీఐ శ్రీనివాస్ రాజ్, నాలుగో టౌన్ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా.. అప్పుల బాధతో సూసైడ్‌కు పాల్పడి ఉంటారని సమాచారం. అన్ని కోణాల్లో విచారణ జరిపాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.