అక్షరటుడే, కామారెడ్డి: Couple arrested in theft case | తాళం వేసిన ఇంట్లో పట్టపగలు చోరీలకు పాల్పడిన దంపతులను సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించారు.
Couple arrested in theft case | తాళం పగులగొట్టి..
పద్మాజీవాడి ఎక్స్ రోడ్‌కు (Padmajiwadi X Road) చెందిన యాళ్ల సురేష్ రెడ్డి ఈనె ల 5న ఇంటికి తాళం వేసి పొలం పనుల నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. మూడు పట్ట గొలుసుల జతలు, రూ.15 వేల నగదు, రెండు గ్రాముల బంగారు దుద్దులు దొంగిలించినట్లు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు (sadashivanagar Police) సిటిజన్ సెంట్రింగ్ విధానం ద్వారా పిటిషన్ స్వీకరించి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి బాధితునికి కేసు కాగితాలు అందజేశారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా..
సీసీ ఫుటేజీ ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు బాలె నర్సింలు అలియాస్ చింటూ అలియాస్ చిన్నా, బొల్లిపల్లి రేణుక అలియాస్ మైలారం రేణుక కలిసి ఇంటితాళం పగులగొట్టి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరిద్దరు భార్యాభర్తలని, తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మల్లన్నగుట్ట వద్ద పట్టుకొని వారి వద్ద నుంచి ఆటో, మొబైల్ ఫోన్, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్(SI Pushparaj) తెలిపారు.