అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని ఏడు మండలాల్లోని 153 గ్రామపంచాయతీలో కౌంటింగ్‌కు ఆయా గ్రామ పంచాయతీల (Gram Panchayats) వారీగా ఓట్ల లెక్కింపును ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
పోలింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించారు. కౌంటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Panchayat Elections | అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్..
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, పిట్లం, మహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సర్పంచ్ (Sarpanch) వార్డు సభ్యుల స్థానాలకు కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కావడంతో పోటీ చేసిన అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్ పేపర్లలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని అభ్యర్థులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయో లేదో అనే తీవ్ర ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు. సాయంత్రంలోగా 153 మంది సర్పంచులు 873 మంది వార్డు సభ్యుల భవితవ్యం తేలనుంది.
Panchayat Elections | 20 గ్రామపంచాయతీలో 90శాతం పోలింగ్ నమోదు
ఎల్లారెడ్డి మండలంలోని (Yellareddy mandal) 31 గ్రామపంచాయతీలో ఐదు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 26 గ్రామపంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 16,147 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అందులో 20 గ్రామపంచాయతీలు 90నుంచి 95శాతం వరకు ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
ఆరు గ్రామపంచాయతీల్లో 80శాతం నుంచి 90శాతం వరకు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వార్డు సభ్యులు సర్పంచులు ఒక్క ఓటు తేడా రాకుండా ఉండాలని వృద్ధులను వికలాంగులను సైతం పోలింగ్ కేంద్రాలకు తరలించి తమ ఓటు బ్యాంక్‌ను పదిలం చేసుకున్నారు. వలస ఓటర్లపై సైతం దృష్టిసారించి వాహనాలను సమకూర్చి పోలింగ్ కేంద్రాలకు తరలించి పూర్తిస్థాయి ఓటింగ్ నమోదు అయ్యేలా అభ్యర్థులు చర్యలు తీసుకున్నారు.