64
అక్షరటుడే, బాన్సువాడ: Fake Currency | వర్ని మండలం జలాల్పూర్లో నకిలీ నోట్ల (Fake notes) ఘటన కలకలం సృష్టిస్తోంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట రుణాన్ని తిరిగి చెల్లించేందుకు స్థానిక బ్యాంక్‌కు వెళ్లాడు.
బ్యాంక్‌లోని క్యాష్ కౌంటర్లో (bank cash counter) రూ.500 నోట్లు 417 ఇచ్చాడు. క్యాషియర్ వాటిని నోట్ల లెక్కింపు యంత్రంలో పెట్టగా అందులో కొన్ని నకిలీ నోట్లుగా తేలాయి. దీంతో వెంటనే స్పందించిన బ్యాంక్ సిబ్బంది వర్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని తెలిసింది.